My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
ABOUT THIS VIDEO:
Lalitha - better known as Sri Lalitha Maha Tripura Sundari, is the supreme goddess of the hindu pantheon more specifically to the shaktha cult.Lalitha means the playful one, and the whole creation, it's functioning and delusion are but the divine play of the universal mother.The Goddess is described to have a very beautiful ( maha lavanya ), ever youthful ( navayavvana ) form, her four hands equipped with the pasham ( noose ), ankusham ( goad ), ikshu kodandam ( sugercane bow ) and pancha baanam ( 5 floral arrows ). Seated on a pancha bramhasana ( a seat with bramha, vishnu, rudra and maheshwara as its four limbs, sada shiva forming its platform ), fanned by saraswathi and lakshmi on either side, she resides in the great city called Manidweepam.The most sacred and popular yanthra in the hindu pantheon - the \\\" Sri Chakra \\\" is considered an embodiment of the supreme goddess and worshiped with utmost devotion.Sri Lalitha Sahasranama is the most popular stothra rendered by hindus sings the praise of the goddess in 1008 epithets.She is considered the feminine personification of the all pervading, omni potent absoulte bramha tatthwa. Worshipping her is sure to bestow the devotee with anthing and everything he wishes for.The Lalitha Pancharathnam is a beautiful stothram composed by \\\" Sri Adi ShankaraAcharya \\\" in praise of the goddess, It is believed that those who chant this stothram in the morning, extolling the mother Lalitha - the Goddess of bliss, an incarnation for Goddess Parvathi - would get luck, knowledge riches, endless fame by the grace of Goddess Lalitha.
శ్రీ లలితా పంచరత్నం (Prayer in Telugu)
ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసం
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగ మదోజ్వల ఫాలదేశం
దొండపండు వర్ణంతో శోభించే క్రింది పెదవితో,తెల్లటి ముత్యం కలిగిన బులాఖీని నాసికపై ధరించి,చెవులవరకు విస్తరించిన కన్నులతో మణులతో కూడిన కర్ణకుండలములతో, చల్లని చిరునవ్వుతో, కస్తూరిని ధరించి శోభిల్లుచున్న విశాలమైన ఫాలభాగంతో విలసిల్లే శ్రీ లలితాదేవి ముఖ పద్మాన్ని ప్రాతః కాలంలో స్మరిస్తున్నాను.
ప్రాతర్ భజామి లలితా భుజకల్పవల్లీం
రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం
మాణిక్యహేమ వలయాంగద శోభమానాం
పుండ్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానాం
బాహువులు కల్పలతగా, అనగా తీగగా, ఎరుపురంగు మణులతో కూడిన ఉంగరములు ఆ తీగకు చివురుటాకులుగా, హస్తములకు మాణిక్య కంకణములతో,చేతిలో చెరకు వింటితో, పూల అమ్ముల పొదితో, పాశము,అంకుశముతో ప్రకాశిస్తున్న శ్రీ లలితాదేవి భుజములకు ప్రాతః కాలంలో నమస్కరిస్తున్నాను.
ప్రాతర్నమామి లలితా చరణారవిందం
భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం
పద్మాసనాది సురనాయక పూజనీయం
పద్మాంకుశధ్వజ సుదర్శన లాంచనాఢ్యం
నిరంతరము నమ్మి భజించు భక్తుల కోరికలు తీర్చునదియు,సంసార సాగరమును దాటించుటకు నావయైనదియు,బ్రహ్మాది దేవతలచేత పూజింపబడునదియు,.
పద్మము,అంకుశము, ధ్వజము వంటివి హస్తములందు ధరించి ప్రకాశించే శ్రీ లలితాదేవి యొక్క పాడపద్మములకు ప్రాతః కాలంలో నమస్కరిస్తున్నాను.
ప్రాతః స్తువే పరాశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్
విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం
విశ్వేశ్వరీం నిగమ వాజ్న్మనసాతి దూరాం
వేదాంతర్గతములైన ఉపనిషత్తులచే స్తుతించబడునదియు,ప్రపంచము యొక్క సృష్టి,స్థితి,లయములకు కారణభూతురాలును,వేదములు,మనస్సు కూడా పూర్తిగా వర్ణించలేని శ్రీ లలితాదేవిని ప్రాతః కాలమున ప్రార్థిస్తున్నాను.
ప్రాతర్వదామి లలితే తవ పుణ్య నామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరేతి
కామేశ్వరి,కమల,మహేశ్వరి,శాంభవి,జగదీశ్వరి,త్రిపురేశ్వరి అనే పుణ్య నామాలతో శోభిల్లే శ్రీ లలితాదేవి నామాలను ప్రాతః కాలంలో స్మరిస్తున్నాను.
యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మైదదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంతకీర్తిం
ఈ లలితా పంచ రత్నాలను ప్రాతః కాలంలో పఠించడంవలన సౌభాగ్యము కలిగి అటువంటి వారి యెడల శ్రీ లలితాంబిక ప్రసన్నురాలై సకల విద్యలను, ఐశ్వర్యాన్ని,సుఖసంతోషాలను, చిర యశస్సును ప్రసాదించి ఆశీర్వదిస్తుంది.
ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ లలితా పంచరత్నం సంపూర్ణం
ఓం శ్రీ లలితాదేవ్యైనమః
ఓం శాంతి శాంతి శాంతిః
Please go through this video in full and derive the full advantages from it.
Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
Thank You.
My Social Links:
Face Book:
Face Book page: @vlnvinnakota
youtube.com/c/VVLNarasimham
#VVL_Narasimham #Lalitha_Pancharatnam
0 Comments